రెపో రేటును పెంచుతూ రిజర్వ్ బాంకు గురువారం నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 35 బేసిస్ పాయిట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు చేశారు.
ఈ ఏడాది వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.25 శాతం పెంచిందని ఆయన పేర్కొన్నారు. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాత్రం ఫిక్స్ డ్ డిపాజిట్ రేటు కేవలం 1 శాతం మాత్రమే పెరిగిందని వెల్లడించారు.
ఓ వైపు ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయాలు తీసుకుంటోందని, మరోవైపు బ్యాంకులు మాత్రం ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లను పెంచకపోవడంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యత్యాసం గురించి ప్రస్తావిస్తూ… సీనియర్ సిటిజన్లు, మధ్యతరగతి కుటుంబాలు ఎందుకు మోసపోతున్నాయి? అంటూ ఆయన ట్విట్టర్‌లో ప్రశ్నించారు.