ప్రపంచ దేశాలను కరోనా వైరస్ ఎంత వణికిస్తుందో చూస్తూనే ఉన్నాం. వ్యాక్సిన్ రావడానికి ఏడాదికి పైగా సమయం పడుతుందన్న ఊహాగానాలు, అంచనాలతో జనంతో పాటు ప్రపంచ దేశాధినేతలంతా నిరాశలో ఉన్నసమయంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ మనుషులపై వ్యాక్సిన్ ట్రయల్స్ చేస్తూ ఓ ఆశను రేకెత్తించింది.
మొదట మనుషులపై క్లినికల్ ట్రయల్స్ చేసిన ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ బృందం ఆ తర్వాత కోతులపై ప్రయోగించింది. ChAdOx1 nCoV-19వ్యాక్సిన్ ను కోతులపై ప్రయోగించగా న్యూమోనియాకు ఈ మందు పనిచేయగలదు కానీ కరోనాను విజయవంతంగా నిలువరించటం లేదని తేలింది.
అస్ట్రజెనెకా- ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి బ్రిటన్ ప్రభుత్వం భారీ వ్యయంతో ఈ వ్యాక్సిన్ తయారీకి కృషి చేస్తోంది. అయితే… ఓ వైపు కోతులపై ప్రయోగం చేస్తూనే మరోవైపు మనుషులపై కూడా క్లినికల్ ట్రయల్స్ చేస్తూనే ఉన్నారు.
కోతులపై ప్రయోగం పూర్తి స్థాయిలో సక్సెస్ కాకపోవటంతో… త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందన్ననమ్మకంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. అయితే… ప్రపంచంలోని చాలా దేశాలు వ్యాక్సిన్ తో పాటు కరోనా నియంత్రణ మందుపై కూడా పరిశోధనలు చేస్తున్నాయి.