ఓయో ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హర్యానా రాష్ట్రం గుర్గావ్ గ్రామానికి చెందిన మౌనిక కొండాపూర్ లోని కాకతీయ రెసిడెన్సీలో స్నేహితులతో కలిసి ఉంటుంది. 2015లో హైదరాబాద్ కు వచ్చిన యువతి ఓయోలో ఉద్యోగిగా పనిచేస్తోంది. అయితే గదిలో ఎవ్వరు లేని సమయంలో మౌనిక ప్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారాన్ని అందించడంతో మౌనిక మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గలా కారణాలు తెలియాల్సి ఉంది.