ఈ భూమండలానికి అత్యంత ప్రమాదకరమని ఒకప్పుడు భావించిన ఓజోన్ రంధ్రం మరో 43 ఏళ్ళ కల్లా పూర్తిగా కప్పబడిపోతుందట.. అంటే 2066 సంవత్సరానికి దీని ‘మరమ్మతు’ జరిగిపోతుందని తాజాగా రీసెర్చర్లు చెబుతున్నారు. అంటార్కిటికా మీదున్న ఓజోన్ పొర పూర్తిగా మటుమాయమైపోతుందని, 1980 లో ఎలా ఉందో అలా మారవచ్చునని వారు అంచనా వేస్తున్నారు. నిజానికి 1940 నాటికే ఇది ఈ విధంగా ‘కొత్త రూపు’ సంతరించుకోవచ్చునని ఐరాసకు చెందిన శాస్త్రీయ బృందం వెల్లడించింది.
కొన్ని హానికరమైన పారిశ్రామిక రసాయనాలను క్రమంగా తొలగిస్తున్నందున.. అంటే వీటిని నివారిస్తున్నందున ఈ ఓజోన్ లేయర్ తిరిగి యధాస్థితికి రావచ్చునని భావిస్తున్నారు. 1989 లో మాంట్రియల్ లో కుదిరిన ఒప్పందం ప్రకారం .. ఈ రసాయనాల ‘తొలగింపు’ విజయవంతంగా జరుగుతోందట. ఆ ఒప్పందం నిషేధించిన రసాయనాల్లో సుమారు 99 శాతం ఇప్పటికే వాడకుండా చేశారని, ఫలితంగా ఓజోన్ పొర ‘రీకవర్’ అవుతోందని కనుగొన్నారు.
క్లైమేట్ చేంజ్ కి ముందు 1980 ప్రాంతానికి ముందే.. ఈ రంధ్రం ఏర్పడడం భూగ్రహానికి పెను ప్రమాదకరమని అంచనా వేశారు. పర్యావరణం తీవ్రంగా దెబ్బ తినవచ్చునని ఆందోళన వ్యక్తమైంది. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల కాలంలో అంటార్కిటికాపై ఓజోన్ రంధ్రం పెద్దదిగా ఉంటోందని, ఇందుకు కారణం వాతావరణ మార్పులేనని పేర్కొన్నారు. క్లోరిన్, బ్రోమైన్. ఫ్లోరిన్ వంటి పారిశ్రామిక రసాయనాలు దీనికి హానికరంగా ఉంటూ వచ్చాయి.
ఈ పొరకు రంధ్రం ఏర్పడడానికి క్లోరోఫ్లోరో కార్బన్స్ కారణమని నాసా ఇదివరకే వెల్లడించింది. ఇలా రంధ్రం పడిన ప్రాంతాల్లో ఓజోన్ రక్షణ ఉండదని, కృత్రిమ రసాయనాలే ఇందుకు దోహదపడుతున్నాయని పేర్కొంది. ఇలాంటి హానికరమైన పదార్థాలవల్ల ఓజోన్ లేయర్ కొన్ని దశాబ్దాలుగా పలచబడిపోతోంది. అయితే వీటి వాడకాన్ని తగ్గిస్తున్న కారణంగా మరో 43 సంవత్సరాలకు ఓజోన్ రంధ్రం కప్పబడిపోవచ్చునన్నది తాజా అంచనా.