ఒకప్పుడు సినిమా నటుల మధ్య మంచి సంబంధాలు ఉండేవి అనే మాట వాస్తవం. ఏదైనా విభేదాలు వచ్చినా వెంటనే పరిష్కరించుకునే పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో. స్టార్ హీరోలు అయినా సరే ఏ విధమైన పట్టింపులకు వెళ్ళకుండా గౌరవం నిలుపుకునే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణ, అక్కినేని, శోభన్ బాబు వంటి హీరోలు ఆ రోజుల్లో ఎవరితో కూడా పట్టింపుకి వెళ్లి తమ మాటే నెగ్గాలి అన్నట్టుగా ఉండేవారు కాదు.
అలా ఎన్టీఆర్ ఒక నటుడి విషయంలో అనుసరించిన విధానం ప్రసంశలు కురిపించింది. మంచి నటుడిగా అప్పట్లో పేరు తెచ్చుకున్న పద్మనాభం స్లోగా నిర్మాత వరకు ఎదిగి నిలబడ్డారు. వరుసగా సినిమాలు చేయడమే కాకుండా స్టార్ హీరోలను ఒప్పించే వారు. 1964 సంవత్సరంలో రేఖా అండ్ మురళి ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. దేవత, పొట్టి ప్లీడర్, శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న వంటి సినిమాలు చేసి హిట్ కొట్టారు.
మర్యాద రామన్న సినిమాతో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గాయకుడిగా అడుగు పెట్టారు. 1968లో శ్రీరామకథ నిర్మించి దర్శకత్వం కూడా వహించారు. ఇలా మర్యాద రామన్న సినిమాకు గానూ ఎన్టీఆర్ ను హీరోగా తీసుకోవాలని భావించారు. కాని ఎన్టీఆర్ మాత్రం నో అనేసారు. దీనితో తప్పక తానే నటించారు ఆ సినిమాలో. ఆ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా వంద రోజులు ఆడింది అలాగే ఎన్టీఆర్ కూడా ఆ వేడుకకు హాజరు అయ్యారు.