హాస్యనటుల్లో సీనియర్ నటుడు పద్మనాభం కు ఎంతో మంచి పేరు ఉంది. అయితే పద్మనాభం అప్పట్లో 1958వ సంవత్సరంలో సహనటుడు నరసింహరావు తో కలిసి రేఖ అండ్ మురళి ఆర్ట్స్ పేరుతో ఓ నాటక సంస్థను స్టార్ట్ చేశారు. అందులో వీరు వేసిన తొలి నాటకం శాంతినివాసం. అయితే కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకొన్న పద్మనాభం ఎన్టీఆర్ సావిత్రి ల ప్రోత్సాహంతో నిర్మాతగా కూడా మారారు.
రేఖ అండ్ మురళి ఆర్ట్స్ పతాకంపై దేవత సినిమాను నిర్మించాడు. ఈ సినిమాను నిర్మించటానికి ముందు పద్మనాభం, సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణి రూమ్మేట్స్. ఒకసారి వేటూరి ఈ ఇద్దరికీ ఓ కథ చెప్పాడు. పద్మనాభంకు ఆ కథ బాగా నచ్చింది. హీరోయిన్ పాత్ర డబల్ రోల్, ఇది నాటకానికి పనికిరాదు. కచ్చితంగా సినిమా తీయాలి ఎవరికైనా చెప్పండి నేను తీయలేను కనుక ఎవరు తీసినా ఆనందమే అని వేటూరి తో పద్మనాభం చెప్పాడట.
అలా చెప్పి రెండు నెలలు గడిచింది. పద్మనాభం అన్ని మర్చిపోయాడు. కోదండపాణి మాత్రం గుర్తుపెట్టుకునే ఉన్నాడు. ఆఖరికి సినిమా తీయమని పద్మనాభం ను కోరాడట. పద్మనాభం కూడా తప్పక ఓకే చెప్పాడట. ఎన్టీఆర్ హీరోగా బాగుంటారని వేటూరిని వెంటబెట్టుకుని ఆయన ఇంటికి వెళ్ళాడట. ఎన్టీఆర్ కి కూడా కథ నచ్చటం డేట్స్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ బ్రదర్ అని చెప్పాడట.
ALSO READ : మళ్లీ పడగ విప్పుతున్న కరోనా… 35శాతం పెరిగిన వీక్లీ కేసులు
హీరోయిన్ గా సావిత్రిని అనుకొని ఆమె ఇంటికి వెళ్లగా ఆమె కూడా ఓకే చెప్పిందట. ప్రతి సినిమాలో ఓ చక్కని పాత్ర లభిస్తుంది… కానీ ఇందులో రెండూ ఉన్నాయన్నమాట అంటూ నవ్వుతూ చెప్పారట. అయితే అప్పటికే సావిత్రి మూడు నెలల గర్భవతి. గర్భం తో నటించడం కష్టమని డెలివరీ అయ్యే వరకు ఆగుతారాని సావిత్రి అడిగారట. అయితే మూడు నెలల్లోనే సినిమా పూర్తి చేస్తామని పద్మనాభం చెప్పారట. చెప్పిన మాట ప్రకారం మూడు నెలల్లోనే సినిమాని పూర్తి చేశారు.
అయితే సినిమా పూర్తి కాకముందు సావిత్రికి అడ్వాన్స్ ఇచ్చే సమయంలో 100రూ నోటు కింద పడిందట. అప్పుడు సావిత్రి ఆ నోటు తీసుకుని కళ్ళకద్దుకుని ఇది మంచి శకునం. ఈ సినిమా 100 రోజులు ఆడుతుంది అని చెప్పుకొచ్చిందట. ఆమె చెప్పినట్లుగానే సినిమా ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమాకు దేవత అనే టైటిల్ ను పెడదామనుకున్నారట. కానీ అప్పటికే దర్శక నిర్మాత బి యన్ రెడ్డి చాలా రోజుల క్రితమే ఈ సినిమా తీశారు. అందులో నాగయ్య హీరో. ఆ టైటిల్ కోసం ఆయనను కలిశారట. అనుమతి లేకుండానే టైటిల్స్ పెడుతున్నారు. నువ్వు నా మీద గౌరవంతో వచ్చి అడుగుతున్నావ్ పెట్టుకో అని చెప్పారట.
ALSO READ : జయం సినిమాలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు చాలా మారిపోయిందిగా ! హీరోయిన్ కంటే..
అలాగే హేమాంబరధరరావు ను దర్శకుడిగా సెలెక్ట్ చేసుకుని 40 వేల రూపాయలకు తన ఇంటిని తాకట్టు పెట్టి ఈ సినిమాను నిర్మించాడట పద్మనాభం. సినిమా స్టార్స్ ను చూడటానికి జనం ఎలా తంటాలు పడతారో ఈ సినిమాలో చూపించాడు. ఎస్.వి.రంగారావు, గుమ్మడి, రేలంగి, కాంతారావు, అంజలీదేవి, షావుకారు జానకి, జమున ఇంటి వద్దకు వెళ్లి పద్మనాభం ఆటోగ్రాఫ్ తీసుకుంటాడు పది నిమిషాల నిడివి కలిగిన ఈ దృశ్యాలు సినిమాకు ఆకర్షణగా నిలిచాయి.
Advertisements
మొత్తం 22 మంది తారలు పాల్గొన్న చిత్రమని ప్రచారం చేశారు. కోదండపాణి అద్భుతమైన సంగీతం అందించాడు. ఎన్టీఆర్ లెక్చరర్ పాత్రలో నటించాడు. తను ఎంతగానో ప్రేమించే భార్య సీత రైలు ప్రమాదంలో మరణించిందని తెలియగానే ఒక్కసారిగా గుండె పగిలేలా ఏడుస్తాడు ఎన్టీఆర్. ఆ సమయంలో వచ్చే నేపధ్య గీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీశ్రీ రెండురోజుల్లోనే రాసిన ఈ పాట ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. మొత్తం మీద దేవత చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది.