తిరుమల శ్రీవారు అన్నా, శ్రీవారి ప్రసాదం అన్నా కళ్లకు అద్దుకొని తింటాం. ఎవరి నమ్మకాలు వారివి. అంతేందుకు తిరుమల పంచాగాన్ని, ఇంగ్లీష్ క్యాలెండర్‌ను కూడా అంతే ఆదరించే వారు కూడా ఉంటారు.
ప్రియాంక రెడ్డి హత్య- మృగాళ్లను ఎన్‌కౌంటర్ చేయాలంటూ ధర్నా
కొత్త ఆంగ్ల సంత్సరం 2020 దగ్గర పడుతున్నందున… ఎప్పటిలాగే తిరుమల కొత్త క్యాలెండర్ కోసం ఎదురుచూస్తున్నవారు చాలా మందే ఉన్నారు. వారంత ఆన్‌లైన్‌లో క్యాలెండర్ బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దాంతో క్యాలెండర్ కోసం సర్చ్ చేస్తున్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సంఘటనలు ఎదురవుతున్నాయి.
చైతన్యం చచ్చి పోయిందా..? సిగ్గుపడండి..
తిరుమల క్యాలెండర్, కొత్త పంచాంగం… కొత్త క్యాలెండర్ అంటూ ఆన్‌లైన్‌లో సర్చ్ చేస్తుంటే… తిరుమల. ఓర్జీ సైట్‌లో శ్రీయేసయ్య, శ్రీ వేంకటేశాయ నమః, శ్రీవికారినామసంవత్సర ఇలాంటి పదాలు కనపడుతున్నాయి. మిగతావన్నీ సరే కానీ… శ్రీయేసయ్య పేరు తిరుమల సైట్‌లో ఎందుకు వచ్చింది… అన్న ప్రశ్న ఉప్పుడు హట్ టాపిక్ అవుతోంది.
జగన్ అరెస్టు కాకూడదని తాంత్రిక పూజలు?
తిరుమలలో అన్యమత ప్రచారం సాగుతోంది అని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక ఏపీలో మతాల లొల్లి ఎక్కువైంది. ఇలాంటి సందర్భంలో ఏకంగా తిరుమల సైట్‌లోనే అన్యమత ప్రచారంపై హిందుమత సంఘాలు, శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందని చెప్తున్నారు… ఇదేనా ఆ గౌరవం అని ప్రశ్నిస్తున్నారు.
మర్లవడ్డ కార్మిక లోకం
తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధించాలని, ఇతర మతస్థులను తొలగించాలని డిమాండ్లు వస్తున్న సందర్భంలో… ఏకంగా తిరుమల వెబ్‌సైట్‌లోనే ప్రచారం నిర్వహించటంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.