అవును. సోషల్‌మీడియా అంటే మీడియా సైతం ఎత్తిచూపలేని ప్రభుత్వ అసమర్ధతను, అవినీతిని, అణచివేతను నిర్భయంగా వ్యక్తపరిచేది. నేతలను ఓ ఆటాడుకుంటూ… ప్రజలకు వాస్తవాలు తెలియపర్చటంలో ముందుంటున్న సోషల్‌మీడియాలో దొంగలు పడ్డారు. అవును… పైసలకు కక్కుర్తిపడే దొంగలు… రాతల పేరుతో వాస్తవాల్ని వక్రీకరించే ప్రయత్నం జరుగుతోంది.
సరే, వారికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది కదా అని వదిలేద్దామా అంటే… సామాజిక సృహా ఉండి, ప్రభుత్వంతో పోరాడుతున్న వారికి అడ్డం పడటమే అసలు సమస్య వచ్చి పడింది. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి, ప్రభుత్వాధినేతకు వ్యతిరేకంగా పోస్ట్ పడితే చాలు… పెయిడ్ బ్యాచ్ ఎంటరైపోతుంది. మిక్స్‌డ్ ఓపినీయన్‌గా కలరింగ్ వచ్చేలా రాతలు, కూతలూ ఉంటాయి.
కానీ, ఆ రాతల వల్ల అసలు బాధితులు, పీడితులకు అన్యాయం జరుగుతుందనే విషయం మర్చిపోతున్నారు. అయితే… ఇందులో వారిని అనడానికి కూడా ఏం లేదు. ప్రభుత్వ పెద్దల వ్యవస్థ అలా ఉంది మరీ. గతంలో ఓ ఎన్నికల సమయంలో… ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాసేందుకు వందలాదిమందిని హైర్ చేసుకొని, స్టార్ హోటల్‌లో విందులు ఏర్పాటు చేసి.. అన్నా చెల్లెల్లు అలా రాయాలి, ఇలా రాయాలి… ఇలా తిప్పికొట్టాలని ప్రాదేయపడ్డారు.
అసలు విషయం ఏంటంటే… ఆవేదనలో నుండి, ఆర్థనాదాల నుండి… కష్టంలో నుండి ఆక్రోశం అక్షరాల రూపంలో బయటకు రావాలి కానీ ఏసీ రూముల్లో, స్టార్ హోటల్ కాంతుల్లో రాతలు బయటకు రావు. మీ విషపు రాతలు కాస్త ఆలస్యంగా అయినా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తాకాయి. అందుకే డిపార్ట్‌మెంట్ ఎదైనా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి అనుకూలంగా లేరు. ఈ విషయం అనేక ఎన్నికల్లో బట్టబయలైంది. అవుతుంది.
ఈ పేటీఎం బ్యాచ్‌లు, హైరింగ్ బ్యాచులతో కాలం ఎక్కవ కాలం వెల్లదీయలేరు. మీడియా సంస్థల్లోకి ఎంటరైనా వారికి ఇప్పటికే ఈ సత్యం తెలిసివచ్చి ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.