పాకిస్తాన్ పార్లమెంట్ సమావేశం శనివారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు వాయిదా పడింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఎలాంటి చర్చ చేపట్టకుండానే సభను మధ్యాహ్నం వరకు స్పీకర్ వాయిదా వేశారు.
సభ ప్రారంభమైన వెంటనే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు ప్రతి పక్ష నాయకులు షాబాజ్ షరీఫ్, షా మహమ్మద్ ఖురేషీ, ఇతరులు పట్టుబట్టారు. సుప్రీం కోర్టు ఆదేశాలను స్పీకర్ పాటించాలని వారు డిమాండ్ చేశారు.
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలనుసారం ఈ రోజు సభను నిర్వహించాలని స్పీకర్ ప్రతిపక్ష నేత షాబాజ్ కోరారు. రాజ్యాంగం ప్రకారం స్పీకర్ తన విధులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
దీంతో మొదట అవిశ్వాసం విషయంలో విదేశీ కుట్రపై చర్చ జరగాలని స్పీకర్ అన్నారు. దీంతో ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గందరగోళం నడుమ సభను మధ్యాహ్నం 12.30 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ అసద్ ఖైసర్ ప్రకటించారు.