బౌండరీల మీద బౌండరీలు బాది, సెంచరీతో ఊపు మీదున్న ధోనీని గాయపర్చాలన్న ఉద్దేశంతోనే బీమర్ వేశానంటూ పాక్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన కామెంట్ చేశాడు. ఫాస్ట్ బౌలర్ బ్యాట్స్ మెన్ తలపై నుండి అత్యంత వేగంగా వేసే బాల్ బీమర్. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షోయబ్ తన తప్పును ఒప్పుకున్నాడు.
ఇరు దేశాల మధ్య మ్యాచ్ లు, ఆటగాళ్ల సంబంధాలపై ఆకాశ్ చోప్రాకు ఇంటర్వ్యూ ఇచ్చిన షోయబ్ 2006 పైసలాబాద్ ఇంటర్వ్యూ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అప్పటికే సెంచరీ చేసి ధోనీ ఊపు మీదున్నాడు. పైగా తన బౌలింగ్ లో ఒకే ఓవర్ లో మూడు ఫోర్లు కొట్టడంతో తను సహనం కోల్పోయానని, క్షణికావేశంలో బీమర్ వేశానన్నాడు. అయితే అది వైడ్ గా వెళ్లటంతో ప్రమాదం తప్పిందని… కానీ తర్వాత తను ధోనీని క్షమాపణ కోరినట్లు తెలిపాడు. ఇప్పటికీ తన తప్పుపట్ల చింతిస్తున్నానన్నాడు. డ్రాగా ముగిసిన ఆ మ్యాచ్ లో ధోనీ 4 సిక్సులు, 19 ఫోర్లతో 148పరుగులు చేశాడు.