పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి తన ప్రసంగంలో కశ్మీర్ ప్రస్తావనను తీసుకు వచ్చారు. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని భారత్ కు సూచించారు.
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… ఆర్టికల్ 370ని పునరుద్దరించాలని భారత్ కు సూచించారు.
ఆసియాలో శాంతియుత పరిస్థితులు నెలకొల్పడానికి భారత్ ఆ నిర్ణయం తీసుకోవడం అనివార్యమన్నారు. ఆర్టికల్ 370ని పునరుద్దిరించాలని, అలా చేస్తే కశ్మీర్ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు.
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన విదేశీ కుట్ర వ్యాఖ్యలను షహబాజ్ ఖండించారు. దేశంలో ప్రస్తుత ద్రవ్యోల్బణ, ఆర్థిక సంక్షోభానికి ఇమ్రాన్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.