పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మరో సారి తన వక్రబుద్ధిని ప్రదర్శించారు. అంతర్జాతీయ సమాజం ముందు నవ్వుల పాలయ్యారు. అంతేకాదు…తన తప్పును తెలుసుకొని వెంటనే సరిదిద్దుకొనే ప్రయత్నం చేసి అందరి ముందు దోషిగా నిలబడ్డాడు.
అసలు విషయం ఏంటంటే…ఉత్తరప్రదేశ్ లో ముస్లింలపై పోలీసులు దారుణ కాండ పేరిట శుక్రవారం రాత్రి ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఆ వీడియో 2013 లో బంగ్లాదేశ్ కు సంబంధించినది. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా ఇమ్రాన్ ఖాన్ పై దాడి మొదలుపెట్టారు. దీంతో వెంటనే తాను చేసింది తప్పని గ్రహించిన ఇమ్రాన్ ఖాన్ ఆ వీడియోను డిలెట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ షేర్ చేసిన వీడియోపై ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తీవ్రంగా స్పందించారు. #ఓల్డ్ యాబిట్స్ డై హార్డ్ ” యాష్ ట్యాగ్ తో ”రిపీట్ ఆఫెండర్స్ (మళ్లీ మళ్లీ తప్పే చేసేవాళ్లు) ”అని ట్వీట్ చేశారు. ఇమ్రాన్ షేర్ చేసి డిలెట్ చేసిన వీడియోను తిరిగి పోస్ట్ చేశారు.
ఈ వీడియో లో ఒక పోలీస్ రాపిడ్ యాక్షన్ బెటాలియన్ షీల్డ్ ను పట్టుకొని ఉన్నాడు. రాపిడ్ యాక్షన్ బెటాలియన్ బంగ్లాదేశ్ లోని యాంటీ క్రైమ్, యాంటీ టెర్రరిజం పోలీస్ వింగ్.
ఇదే కాకుండా పాకిస్థాన్ లోని నాన్ కానా సాహిబ్ గురుద్వారా లో హింసను భారత్ తీవ్రంగా ఖండించింది. పవిత్ర స్థలంలో విధ్వంసం, అపవిత్రం తగదంది. గురుద్వారాలో ఉన్న సిక్కుల రక్షణపై తక్షణమే చర్యులు తీసుకోవాలని పాకిస్థాన్ ను కోరింది. సిక్కు ప్రార్ధనా స్థలం ధ్వంసం కాలేదని శుక్రవారం అర్ధరాత్రి పాకిస్థాన్ ప్రకటించింది.