ఇప్పటికే రాజకీయ సంక్షోభంతో సతమతమవుతున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొత్త చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఆయన చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 45 నిమిషాల ఆయన ప్రసంగంలో ఓ మూడు పదాలను ఆయన 213 సార్లు ఉపయోగించి నెటిజన్లకు దొరికిపోయారు. దీంతో ఇమ్రాన్ ఖాన్‌ను సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.
అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఇమ్రాన్ ఖాన్.. దేశంలోని రాజకీయ సంక్షోభంపై జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆయన మొత్తం 45 నిమిషాలు మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై పోరాటాన్ని క్రికెట్ మ్యాచ్ తో పోల్చుతూ చివరి బంతి వరకు ఆడతానని అన్నారు. అయితే ఆ ప్రసంగం విన్న నెటిజన్లు మై, ముఝే, మేరా అనే పదాలను ఆయన 213 సార్లు ఉపయోగించినట్లు గుర్తించారు. ఈ వివరాలను హమీద్ మిర్ అనే పాత్రికేయుడు షేర్ చేశారు.
దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగంపై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. దీనిపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు ఖాన్ ను నార్సిసిస్ట్ గా అభివర్ణిస్తూ కామెంట్లు పెట్టగా, మరికొంతమంది ఆయన స్పీచ్ పై ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
Thats how i complete my 800 words eassy in 5 grade 😎😎😂😂 https://t.co/D7P4NNGg1L
— نامعلوم بندہ (@namalombanda) April 1, 2022
Advertisements
మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కు ఊరట లభించింది. ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు నేషనల్ అసెంబ్లీ(పార్లమెంట్) డిప్యూటీ స్పీకర్ ఖాసీమ్ సూరి వెల్లడించారు. ఈ తీర్మానం వెనుక విదేశీ కుట్రలు ఉన్నాయని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 5కు వ్యతిరేకంగా ఉందని ఆయన వివరించారు. అందువల్ల ఈ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు చెప్పారు.