ధామి కోహ్లీ…పాకిస్థాన్ లోని సింధుకు చెందిన అమ్మాయి. అక్కడ మత వేధింపులు తట్టుకోలేక ఆమె కుటుంబం కొన్నేళ్ల క్రితం పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చింది. జోద్ పూర్ కు 20 కిలో మీటర్ల దూరంలోని ఆంగాన్వా శరణార్ధి శిబిరంలో నివసిస్తోంది. పదో తరగతి వరకు పాకిస్థాన్ లో చదివిన ధామి… పదకొండు, పన్నెండో తరగతి రాజస్థాన్ లో చదువుతోంది. పదకొండో తరగతి పూర్తి చేసిన ఆమె మరో రెండు నెలల్లో పన్నెండో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంది. అయితే ఇంతలో ఆమె పరీక్షలు రాయడానికి అనుమతి నిరాకరిస్తూ నోటీస్ ఇచ్చింది స్కూల్ సిబ్బంది.
నేను అన్ని సర్టిఫికెట్లు ఇచ్చాను. నాకు చదువుకునే హక్కు ఉంది. అయినా స్కూల్ సిబ్బంది నోటీస్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తోంది ధామి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దొతసర ఈ విషయంపై స్పందిస్తూ కొన్ని రూల్స్ ఛేంజ్ చేస్తే ఆమెను పరీక్షకు అనుమతించొచ్చని చెప్పారు. ఆమె సిలబస్ కు సంబంధించిన విషయంపై పాకిస్థాన్ ఎంబసీకి లెటర్ రాశామని…ఆమె అక్కడ చదివిని సబ్జెక్ట్ లు ఇక్కడి సబ్జెక్ట్ లు ఒక్కటా…కాదా అని కనుక్కోవడానికి లెటర్ రాశామన్నారు. అక్కడి నుంచి లెటర్ పాజిటివ్ గా వస్తే ఓకేనని..లేక నెగిటివ్ గా వచ్చినా ఇక్కడ కొన్ని రూల్స్ ను మార్చి ఫైనల్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి అనుమతిస్తామని హామీ ఇచ్చారు.