పాప్ సింగర్ కాస్తా పగబట్టి స్నేక్ సింగర్‌గా మారింది. పగబట్టింది ఎవరిమీదో కాదు, మన పీయం మోడీ మీద.. పైగా పాముల్నిపంపించి చంపిస్తానంటోంది. ఆర్టికల్ 370 నిర్వీర్యంపై భారత్ తీసుకున్నడెసిషన్ పాకిస్థానీలకు బాగానే షాకిచ్చింది. పాక్ సింగర్ రబీ పిరజాదా కూడా అలానే షాకయ్యింది. ఈ షాక్ నుంచి కాస్త తేరుకుందో ఏమో ఇప్పుడు సోషల్ మీడియాలో తన అక్కసు వెళ్లగక్కింది. పాములు, మొసళ్లు పెట్టుకుని తీయించుకున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. ‘ఒక కశ్మీరీ యువతిగా వీటిని మోడీకి కానుకగా ఇస్తా. చచ్చి నరకానికి పోయేందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ ట్వీట్ చేసింది. దీనికి ఇండియన్స్ అంతెత్తున లేస్తున్నారు. కొందరైతే నీకు అంత సీన్ లేదనేశారు. ముందు నువ్వు వేసే జోకులకు మమ్మల్ని నవ్వుకోనీ..’ అంటూ సెటైర్లు వేశారు.
Why should Rabi Pirzada stay behind when everyone else is fighting for Kashmir..pic.twitter.com/gCa2VsEM0u
— Naila Inayat नायला इनायत (@nailainayat) September 3, 2019