పాక్ ఆర్మీ అధికారుల అత్యుత్సాహనికి 120మంది పౌరుల ప్రాణాలు గాలిలో కలిసేవి. డిల్లీ నుండి వెళ్తోన్న భారత విమానంపైకి పాక్ యుద్ధవిమనాలు దూసుకొచ్చాయి. రెండు ఎఫ్-16 యుద్ధ విమానాలు భారత విమానాన్ని వెంబడించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ప్రయాణికులతో వెళ్తోన్న స్పైస్ జెట్ విమానాన్ని భారత యుద్ధవిమానాలుగా పాక్ యుద్ధవిమనాలు పొరబడ్డాయని తెలుస్తోంది. అయితే, పాక్ అత్యుత్సాహం కారణంగా ఏమైనా జరిగి ఉంటే… ఎలా ఉండేది అని ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన గత నెల 23న జరిగినట్లు తెలుస్తోంది.