ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ టీం ఆట తీరు క్రీడా ప్రేమికులను అబ్బురపరుస్తోంది. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. సోమవారం కరాచి వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్ బ్యాటింగ్ వేగాన్ని విండీస్ బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి పాక్ 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. రిజ్వాన్, హైదర్ అలీలు అర్థశతకాలతో చెలరేగిపోయారు. తరువాత బ్యాంటింగ్ చేసిన విండీస్ 137 పరుగులకు ఆలౌట్ అయింది.
అయితే, ఈ మ్యాచ్ విజయం సాధించిన పాకిస్థాన్.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాదిలో 18 టీ20 మ్యాచ్ లు గెలిచి చరిత్ర సృష్టించింది. టీ20 చరిత్రలో ఈ రికార్డ్ ఒక్క పాకిస్థాన్ కే దక్కింది. 2018లో 17 మ్యాచ్ లు గెలిచిన పాక్ .. ఇప్పుడు తన రికార్డ్ తానే తిరగరాసుకుంది.