స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో పాక్ కెప్టెన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ బాబర్ ఆజమ్ ని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. మూడో వన్డేలో కేవలం 4 పరుగులే చేసిన ఆజమ్.. డకౌట్ అయ్యాడు. దీంతో ఓ అరుదైన చెత్త రికార్డును తన పేరుమీద లిఖించుకున్నాడు. వరుసగా మూడు వన్డేల్లోనూ ఒకే విధంగా అవుట్ అయిన ఆటగాడిగా నిలిచాడు. న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల్లోనూ బాబర్.. స్టంప్ అవుట్ గా వెనుదిరిగాడు.
ఒక సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లోనూ స్టంప్ అవుట్ అయిన ఆటగాడిగా బాబర్ చెత్త రికార్డును క్రియేట్ చేశాడు. దీంతో ఎంతో అవమానకర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో 82 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 66 పరుగులు చేశాడు బాబర్ అజమ్. అనంతరం గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ లో స్టంప్ అవుట్ అయ్యాడు.
అలాగే రెండో మ్యాచ్ లో 114 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ తో 79 పరుగులు చేసిన బాబర్.. సోధీ బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు కరాచీ వేదికగా జరిగిన మూడో వన్డేలోనూ బాబర్ స్టంప్ ఔటయ్యాడు. 13 బంతుల్లో ఒక ఫోర్ తో 4 పరుగులు చేసిన బాబర్..బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్‌గానే పెవిలియన్ చేరాడు.
దీంతో బాబర్ అజమ్ స్టంప్ ఔట్ స్‌లో హ్యాట్రిక్ సాధించాడంటూ.. క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు. దీంతో త్వరలోనే పాక్ కెప్టెన్ పై వేటు పడే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.