పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుంది. పెరుగుతున్న ధరల వల్ల ప్రజలకు రెండు పూటల తిండి దొరకడమే చాలా కష్టంగా మారింది. ఇదిలా ఉండగా ఆకలి చావులతో పాకిస్తాన్ లో దోపిడీలు కూడా మొదలయ్యాయి. తినడానికి గోధుమ పిండి లభించకపోవడంతో ప్రజలు కోళ్లను ఎత్తుకుపోతున్నారు. రావల్పిండిలో చాలా మంది ప్రజలు ఆయుధాలతో పౌల్ట్రీ ఫామ్‌లో దొంగతనానికి పాల్పడ్డారు.
పాకిస్తాన్ జనరల్ అసిమ్ మునీర్ తెర వెనుక ఉండి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. 12 మంది వ్యక్తులు ఆయుధాలతో వచ్చిన వ్యక్తులు ముందుగా పౌల్ట్రీ ఫామ్ సిబ్బందిని బందీలుగా చేశారు. ఆ తరువాత సుమారు 5000 కోళ్లను ఎత్తుకుపోయారు. ఆ కోళ్ల ధర దాదాపు 30 లక్షల వరకు ఉంటుందని పౌల్ట్రీ యజామానులు చెబుతున్నారు.
పౌల్ట్రీ యజమాని వకాస్ అహ్మద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో 12 మంది వ్యక్తులు ఆయుధాలతో వచ్చి సిబ్బందిని బెదిరించి, బంధించి కోళ్లన్నంటిని లారీలో ఎక్కించుకుని పారిపోయారని పేర్కొన్నారు. ఈ ఘటన పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పాకిస్తాన్ కరెన్సీ కూడా రోజురోజుకి పతనమవుతుంది.
దీంతో కోట్లాది మందికి తిండి లేకుండా పోయింది. కనీస అవసరాలకు కూడా డబ్బులు లేకపోవడంతో ప్రజలు దోపిడీలకు పాల్పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం దేశంలో ఎప్పుడైనా అంతర్యుద్ధం గంటలు మోగవచ్చు. యూఏఈ, సౌదీ అరేబియా కశ్మీర్ సమస్యను వదిలివేయకపోతే దానిని మునిగిపోకుండా ఎవరూ రక్షించలేరని మాటలు వినిపిస్తున్నాయి.