తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ను ఎయిర్ అంబులెన్స్ లో లండన్ కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం నాలుగు వారాల పాటు షరీఫ్ అక్కడే ఉండేందుకు లాహోర్ హైకోర్టు అనుమతిచ్చింది. అయితే నవాజ్ షరీఫ్ లండన్ వెళ్లేందుకు కోర్టు రూ.700 కోట్ల పూచీకత్తుపై మాత్రమే కోర్టు అనుమతిచ్చింది. నవాజ్ షరీఫ్ వెంట ఆయన సోదరుడు షాబాజ్ షరీఫ్, పర్సనల్ డాక్టర్ ఉన్నారు. అవసరమైతే షరీఫ్ ను అమెరికా తరలించవ్చని పీఎంఎల్ఎన్ ప్రతినిధి తెలిపారు. లండన్ తీసుకెళ్లేటప్పుడు నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు పరీక్షించారు. లండన్ వెళ్లే వరకు ఆరోగ్యం స్థిరంగా ఉండేందుకు అధిక మోతాదులో స్టెరాయిడ్లు, మందులు ఇచ్చినట్టు సమాచారం.అవినీతి కేసులో నవాజ్ షరీఫ్ ప్రస్తుతం ఏడు సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నారు.