జమ్ము కశ్మీర్ విషయంలో భారత్ పై పాక్ మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. కశ్మీర్, పాలస్తీనా మధ్య సంబంధం ఉందని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దానీ అన్నారు. రెండు కూడా ఇకే విధమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పాలస్తీనా, కశ్మీర్ ప్రజల కష్టాల్లో చాలా పోలీకలు ఉన్నాయని ఆయన అన్నారు. ఐరాస ముందు రెండు దేశాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయన్నారు. పాలస్తీనాపై మాత్రమే కాకుండా కశ్మీర్‌పై కూడా పాకిస్థాన్ అదనపు శ్రద్ధ వహించాలనుకుంటోందన్నారు.
కశ్మీర్ అంశాన్ని ఐరాస గుర్తించేలా చేసేందుకు తాను చాలా కష్టపడాల్సి వస్తోందన్నారు. కశ్మీర్‌ను ఐరాస ప్రధాన అజెండాలోకి తీసుకు వచ్చేందుకు తాను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఐరాసలో ప్రతి వేదికపైనా జమ్మ కాశ్మీర్ సమస్యను పాక్ లేవనెత్తు తోందన్నారు.
వేరే అంశాల గురించి చర్చించినా లేదా చర్చించకున్నా కశ్మీర్ విషయంలో మాత్రం పాక్ పోరాడుతూనే ఉందన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… భారత్ తమ మిత్ర దేశం అని అన్నారు. వెంటనే తడబడి కాదు పొరుగు దేశమని ఆయన అన్నారు.
కశ్మీర్ ప్రస్తావన తీసుకు వచ్చినప్పుడల్లా పొరుగు దేశం భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందంటూ పేర్కొన్నారు. కశ్మీర్ విషయంలో భారత్ కల్ల బొల్లి మాటలు చెబుతోందన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మొదలు అన్ని రకాల వేదికలపైనా పాలస్తీనా, కశ్మీర్ ప్రజల కష్టాల ప్రస్తావన తీసుకు వస్తున్నామన్నారు.