ముంబై : భారతదేశంలోని పోర్టులపై దాడులకు పాక్ కమెండోలు వ్యూహరచన చేసినట్టు తెలియడంతో భారత ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. పాకిస్తాన్ శిక్షణ పొందిన ఈ కమాండోలు నీటి అడుగున దాడులకు శిక్షణ పొందిన ప్రమాదకర వ్యక్తులని అంటున్నారు. హరామి నాలా క్రీక్ ప్రాంతం ద్వారా గుజరాత్ కచ్ గల్ఫ్‌లోకి ప్రవేశించినట్టు కోస్ట్ గార్డ్ స్టేషన్ నుంచి సమాచారం ఉంది.
ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలో పోర్టుల భద్రతకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అదోవిధంగా ముంబై ముంద్రా నౌకాశ్రయంలోని అన్ని నౌకలు అత్యంత భద్రతా చర్యలు తీసుకోవాలని, పోర్టులలో అప్రమత్తంగా ఉండాలని అదాని పోర్ట్స్ గ్రూప్ హెచ్చరికలు పంపింది. దీంతో ముంద్రా పోర్టులో నంబర్ వన్ సెక్యూరిటీ అలర్ట్ ఉంది.
అన్ని షిప్పింగ్ ఏజెంట్లు, వాటాదారులు తమ ఓడల భద్రతపై హై అలర్ట్ ప్రకటించారు. అనుమానాస్పద కార్యకలాపాలను మెరైన్ కంట్రోల్ స్టేషన్ మరియు పోర్ట్ ఆపరేషన్ సెంటర్‌కు నివేదించేందుకు అప్రమత్తమయ్యారు.