అనుకున్నదే జరిగింది. ఆఖరి బంతికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రత్యర్థులు విసిరిన అవిశ్వాస తీర్మానపు బంతిని ఆడలేక వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో పరాజయాన్ని మూటగట్టుకుని వెనుదిరిగాడు.

ప్రధాని ఇమ్రాన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టు స్పీకర్ ఆయాజ్ సాదీఖ్ వెల్లడించారు. దీంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే సాంకేతికంగా 172 ఓట్లు కావాలి.
ఈ తీర్మానంలో ఆశ్చర్యకరంగా కావాల్సిన దాని కన్నా రెండు ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. దీంతో కేవలం మూడు ఓట్లు ప్రధాని ఇమ్రాన్ భవితవ్యాన్ని నిర్ణయించినట్టు రాజకీయ పండితులు చెబుతున్నారు..