దర్శక ధీరుడు రాజమౌళి మూవీ ‘ట్రిపులార్ ‘ లోని ఎలెక్ట్రి ఫయింగ్ సాంగ్ ‘నాటు నాటు’ గురించి ఎంత చెప్పినా తక్కువే ! ఆస్కార్స్ -2023 లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ధమాకా రేపిన ఈ పాట గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా దీనికి ఫిదా కాని సినీ ప్రియులు లేరన్నది నిర్వివాదాంశం.
ఈ పాటకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్ ఇప్పటికీ అనేకమందిని ఉర్రూతలూగిస్తునే ఉంది. తాజాగా పాకిస్తాన్ నటి హానియా ఆమిర్..’ నాటు’ పాటకు ఐసైపోయి ఓ పెళ్లి వేడుకలో దీనికి అద్భుతంగా డ్యాన్స్ చేసిందంటే ఇక చెప్పేదేముంది ? బంగారు రంగు షిమ్మరీ షరారా సెట్ ధరించి.. అచ్చమైన భారతీయ యువతిలా ఆమె వేసిన స్టెప్పులు ఈ వెడ్డింగ్ కి హాజరైన వారినందరినీ మెస్మరైజ్ చేసింది.
ఈ వీడియోను ‘వెడ్డింగ్ బ్రిడ్జ్’ ఇన్స్ టా గ్రామ్ లో షేర్ చేసింది. అయితే ఆమె పాక్ లో ఏ ప్రావిన్స్ లో ఈ డ్యాన్స్ చేసిందన్నది తెలియలేదు.
ఇటీవలి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులకు సంబంధించిన పలు కేటగిరీల్లో ట్రిపులార్ సినిమా మళ్ళీ తన ‘తడాఖా’ చూపిన తరుణంలో పాకిస్తానీ నటి హానియా ఆమిర్ ఈ పాటకు చేసిన డ్యాన్స్ అద్భుతమైన అనుభూతినిచ్చింది.