భారత్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకొంది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న పాకిస్తాన్ యువతిని రక్షించింది. ప్రస్తుతం ఆమెను అధికారులు పశ్చిమ ఉక్రెయిన్ కు తరలించారు.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న పాకిస్తాన్ కు చెందిన అస్మా షఫీక్ ను అధికారులు రక్షించారు. త్వరలోనే ఆమె వారి కుటుంబ సభ్యులను కలుసుకుంటుందని వెల్లడించారు. భారత్ అందిస్తున్న సహాయంపై అస్మా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కష్ట పరిస్థితుల్లో సహాయం చేసిన భారత అధికారులకు ధన్యవాదాలు చెబుతూ.. ప్రధాని మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసింది.
ఉక్రెయిన్ లో విదేశీయులను కాపాడటం ఇది తొలిసారి కాదు. అంతకుముందు బంగ్లాదేశీ పౌరుడ్ని సేఫ్ గా తీసుకెళ్లినట్లు విదేశాగ శాఖ తెలిపింది.