బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మను హత్య చేసేందుకు పాకిస్తాన్ కు చెందిన ఓ వ్యక్తి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించాడు. ఆ వ్యక్తిని రాజస్థాన్ లోని శ్రీ గంగా నగర్ జిల్లాలో బీఎస్ఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), ఇతర నిఘా సంస్థలు విచారిస్తున్నాయి.
ఆ వ్యక్తిని రిజ్వాన్ అశ్రాఫ్ గా పోలీసులు గుర్తించారు. అతను పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రం మండి బహుద్దీన్ లో నివాసం ఉంటున్నాడు. హిందూ మాల్ కోట్ సెక్టార్ లో ఖఖన్ చెక్ పోస్టు గుండా దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించేందకు ప్రయత్నం చేసినట్టు పోలీసులు తెలిపారు.
అతని దగ్గర నుంచి 11 ఇంచుల పొడవైన కత్తిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దాంతో పాటు ఇతర మతపరమైన పుస్తకాలు, ఆహారం, బట్టలు, ఇసుక లభించినట్లు అధికారులు వెల్లడించారు.
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను హతమార్చేందుకే తాను ఇండియాకు వచ్చినట్టు పోలీసులు విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. నుపుర్ శర్మను హత్య చేసేందుకు నిర్ణయించుకున్న అష్రఫ్ అంతకన్నా ముందే అజ్మీర్ దర్గాను సందర్శించాలని అనుకున్నట్టు తెలుస్తోంది.