పాలకొల్లు నుండి ఏలూరు వరకు రైతుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి “సైకిల్” పై బయలుదేరారు పాలకొల్లు శాసన సభ్యులు నిమ్మల రామానాయుడు. ఆక్వా , వ్యవసాయ రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి గట్టెక్కించడానికి ఎన్ని రకాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో రైతుల వ్యదను ప్రభుత్వానికి మరింత గట్టిగా వినిపించడానికి సైకిల్ పై ఏలూరు బయలుదేరిన శాసనసభ్యులు నిమ్మల రామానాయుడుని భీమవరంలో పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులకు సాగు నీరు అందిస్తూ పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అరెస్ట్ అనంతరం రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని కోరుతూ ఇంటి వద్ద దీక్ష చేపట్టారు.
నా ఇంట్లో 4 గురు సభ్యులే నా కుటుంబం అనుకోవడం లేదు , నా నియోజక వర్గ ప్రజలు అందరు నా కుటుంబంగా భావిస్తున్నాను. సమస్యలపై మాట్లాదామంటే కలెక్టర్ , SP , వంటి జిల్లా అధికారులు కనీసం ఫోన్ లో అందుబాటులో ఉండటం లేదు. ప్రజా ప్రతినిధితో మాట్లాడం కంటే ఇంకా ఎక్కువ ముఖ్యమైన పనులు కలెక్టర్ , SP లకు ఎమున్నాయో నాకు తెలియడం లేదు. కలెక్టర్ , SP వంటి జిల్లా అధికారులు అందుబాటులోకి లేకపోవడంతోనే కరోనను ప్రక్కన పెట్టి ఏలూరు వెళ్లవలసి వచ్చిందన్నారు.
వ్యవసాయ రంగంలో మంత్రుల ప్రకటన ధరలకు క్షేత్ర స్థాయిలో ఉన్న ధరలకు పొంతనలేదు.ఆక్వా రైతులను ఆదుకునే విధంగా ఆక్వా ఉత్పత్తులకు ధరల స్థిరికరణ నిధి నుండి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలి. ఆక్వా రైతులను ఆదుకోవడానికి ఒక కేజీ ఆక్వా ఉత్పత్తికి రు. 50 లు ప్రభుత్వం మద్దతు ధర అందించాలలి. దాళ్వా పంటకు ఎకరాలకు 30 వేలు పెట్టుబడి పెట్టి సాగు నీరు లేక పంట కోల్పోయిన రైతులకు పెట్టుబడి నష్టం ప్రభుత్వం చెల్లించాలి. వరి, మిర్చి , పసుపు, బొప్పాయి, అరటి , ఇలా వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు.