లాక్ డౌన్ ను ఉల్లంఘించి శుక్రవారం 100 మంది తో గుంపు గా చేరి ఒక చిన్న బ్రిడ్జి ను పలమనేరు వైసిపి ఎమ్మెల్యే వెంకటేశ్ ఓపెన్ చేశారంటూ మీడియా లో వచ్చిన కథనాలపై ఆయన అనుచరుడు దుర్భాషలాడాడు. మీడియాకు సిగ్గులేదా అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. స్థానికంగా ఉన్న ప్రజల కష్టాలు చూసి ఒక బ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఇంత రాద్ధాంతం చేస్తారా అంటూ విరుచుకుపడ్డాడు.
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నిర్ణయం అమలులోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితం అయ్యారు.ఎవ్వరు కూడా గుమిగూడి ఉండకుడంటూ అధికారులు, పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలను బేఖాతరు చేసి 100 మందితో కలిసి బ్రిడ్జి ప్రారంభోత్సవంలో పాల్గొనటం పై విమర్శలు వెల్లువెత్తాయి. మీడియాలో వచ్చిన కథనాలను చూసిన ఆయన అనుచరుడు మీడియా పై ఏ విధంగా మాట్లాడాడో మీరే చూడండి.