మహబూబ్ నగర్ జిల్లాలో కొందరు రాజకీయ నేతలు అధికార ‘మదం’ ఎక్కువై కొట్టుకుంటున్నారు. చేతిలో పవర్ ఉందనే గర్వంతో.. పరాయి ఇళ్లలోకి దూరుతున్నారు. లోకల్‌గా అందమైన ఆడవారు కనిపిస్తే చాలు.. వారి అవసరాలను బట్టి.. ఏదో ఒకటి ఎరవేసి లోబరుచుకుంటున్నారు. ఒకరో ఇద్దరో కాదు.. కౌన్సిలర్ నుంచి ఆ పై స్థాయిల్లో ఉన్న చాలా మంది నేతలు.. గోడ దూకడం ఓ పనిగా పెట్టుకున్నారు. వావీవరుసలే కాదు తమ వయసు కూడా మరిచిపోయి రాసలీలల్లో మునిగి తేలుతున్నారు. వారి యవ్వారానికి సంబంధించిన వివరాలన్నీ కాస్తా ఆడియోల రూపంలో.. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
షాద్‌నగర్ పరిధికి చెందిన ఓ రాజకీయ నేత ఒకరు.. వివాహితను ఫోన్‌లో వేధించడం, ఆపై ఆమె పోలీసులను ఆశ్రయించడంతో మొత్తం అందరి బాగోతాలూ బయటపడుతున్నాయి. ఇప్పటికే నలుగురైదుగురు నేతల అక్రమ గుట్టు మొత్తం .. వాట్సాప్‌లో గుప్పుమంటోంది. హైదరాబాద్‌లో గడిపి వద్దామంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ కౌన్సిలర్ ఓ మహిళను కోరుతున్న మాటలు ఒక ఆడియోలో కలకలం రేపితే… భర్తను వదిలేసి వచ్చేయ్ అన్ని చూసుకుంటా అంటూ మరో లీడర్ ఇంకో మహిళకు ఆఫర్ ఇస్తున్నట్లు మరో ఆడియోలో ఉంది. ఇక మరో ఆడియోలో ఓ కౌన్సిలర్ రాసలీలలపై ఓ యువకుడు నిలదీస్తున్నాడు. ఇవన్నీ ఇప్పుడు షేర్ల మీద షేర్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో ఇలా ఒక్కొక్క రాజకీయ నేత రాసలీలలు బయటపడుతుండటంతో.. ఇన్నాళ్లు పైకి హుందాగా కనిపిస్తున్న వీరంతా ఇంత పెద్ద కామాంధులా అని తెలిసి స్థానికులు నోరెళ్లబెడుతున్నారు.