శాసన మండలి మీడియా పాయింట్ లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో ప్రగతి భవన్ ను పేల్చివేయాలని వ్యాఖ్యలు చేశారని మండి పడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీలు అందరూ కలిసి డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
పీడీ యాక్ట్ పెట్టాలని కోరుతామన్నారు. రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ లోక్ సభ స్పీకర్ కు చేప్తామన్నారు. మలుగు జిల్లాలో అభివృద్ధి పనులపై కూడా తప్పుగా మాట్లాడారని మండిపడ్డారు. ములుగు జిల్లాను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు. మలుగులో గిరిజన యూనివర్శిటీ పై కూడా వ్యాఖ్యలు చేశారు. వర్శిటీకి సంబంధించిన భూమిని సేకరించడం జరిగిందన్నారు. వర్శిటీపై పార్లమెంట్ లో మాట్లాడాలని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ మృత్యుశయ్యపై ఉందని ఎద్దేవా చేశారు. వర్శిటీ భూమి,భవనాలు వివరాలు ఇస్తాం.. వాటిపై కేంద్రాన్ని ప్రశ్నించు అంటూ సవాల్ విసిరారు. సీనియర్లను కాదని ఒక బ్లాక్ మెయిలర్ ను పీసీసీ అధ్యక్షుడిగా పెట్టుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇలా ఉంటే.. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ను మావోయిస్టులు పేల్చివేయాలని పాదయాత్రలో టీపీసీసీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
గతంలో దొరల గడిలను కూల్చివేసిన మావోయిస్టులు ప్రగతి భనవ్ కూడా కూల్చివేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్ ఉంటే ఏంది.. లేకుంటే ఏంది.. అందుకే మావోయిస్టులు డైనమేట్లు పెట్టి ప్రగతి భవన్ ను పేల్చివేస్తే మాకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ములుగులో రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండిపడుతోంది.