ఓవైపు పోలీసులతోనే వైసీపీ ఎన్నికల్లో గెలుస్తుందని టీడీపీ ప్రచారం చేస్తుంటే, తనను పోలీసు ఉన్నతాధికారి గుర్తు పట్టకుండా తన ఫిర్యాదును తీసుకోలేదని పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే అనిల్ కుమార్ తన నియోజకవర్గంలో ఓ టీడీపీ నేత వైసీపీ నేతపై దాడి చేశారని ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్లగా, ఏలూరు డీఐజీగా ఎన్నికలను పర్యవేక్షిస్తున్న అధికారి పట్టించుకోలేదు. దీంతో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ఆయన ఏకంగా స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
చిన్న చిన్న అంశాలే పెద్దవిగా చేస్తున్నారని టీడీపీ విమర్శిస్తుండగా, వైసీపీ మాత్రం ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకూడదన్నట్లు దూకుడుగా వెళ్తుంది.