యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు తెరపై తనదైన ముద్ర వేసి స్టార్ హీరోగా ఎదిగాడు. నటన, డాన్స్, డైలాగ్ లలో తనకు తానే పోటీగా నిలిచాడు. అందులోనూ ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో దుమ్ములేపాడు. కొమురం భీమ్ పాత్రలో తారక్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వచ్చే కొమరం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ నటన అద్భుతమనే చెప్పాలి. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా సత్తా చాటుతుంది. మొన్నటి వరకు ఇండియాకే పరిమితమైన ఈ మూవీ క్రేజ్.. ఇప్పుడు వెస్ట్ సైడ్ కూడా పాకింది.
ఇప్పటికే ‘నాటు నాటు’ సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డుని దక్కించుకుంది. మరోవైపు లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్ అసోసియేష్ పురస్కారం దక్కింది. అంతేకాదు బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ మూవీ విభాగంలో ఉత్తమ చిత్రంగా క్రిటిక్ ఛాయిస్ అవార్డుని `ఆర్‌ఆర్‌ఆర్` సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆస్కార్ కోసం పోటీ పడుతుంది. ఆస్కార్ కోసం రెండు అడుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది.
అయితే ఇటీవల లాస్ ఏంజెల్స్ లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్దుల వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితోపాటు ఎన్టీఆర్, రామ్‌చరణ్, దర్శకుడు రాజమౌళి, రమా రాజమౌళి, శ్రీవల్లి పాల్గొన్నారు. అయితే ఈ పురస్కారం వచ్చిన సందర్భంగా అమెరికన్ మీడియాతో ఎన్టీఆర్ ముచ్చటించాడు. ‘వెరైటీ’ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ వాహ్ అనిపించాడు. యంగ్ టైగర్ ఈ రేంజ్‌లో అమెరికన్ యాసలో ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే నోరెళ్లబెట్టి చూడటం ఇతరుల వంతైంది. అంతేకాదు ఆ మీడియా ప్రతినిధి బర్త్ డేకి చిన్న గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు తారక్.
అయితే అవన్నీ పక్కకు వెళ్లిపోయాయి. ఎన్టీఆర్ యాసని ఫేక్ యాక్సెంట్ అంటూ ట్రోల్స్ చేశారు కొందరు నెటిజన్లు. లేటెస్ట్ గా దీనిపై ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యాడు. డైరెక్ట్ గా దీనిపై ఆయన కామెంట్ చేయలేదుగానీ, పరోక్షంగా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఊహించని సమాధానంతో దిమ్మతిరిగేలా చేశారు. కాలమానం, యాసల పరంగానే మన మధ్య వ్యత్యాసాలు ఉండొచ్చు.
కానీ పశ్చిమ దేశాల్లో ఒక నటుడు ఎలాంటి విధానాన్ని అవలంభిస్తాడో తూర్పు దేశాల్లోనూ అదే విధంగా ఉంటుందన్నాడు. ఇక రాజమౌళి గురించి మాట్లాడుతూ.. రాజమౌళి గ్రేట్ పర్సన్. తీసే ప్రతీ సినిమాతో ఆయన మరింత వృద్ధి చెందుతున్నాడు. మేము ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం ఆర్ఆర్ఆర్ మూవీ. ఈ చిత్రం గ్లోబల్ సినిమాగా పేరు సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది అంటూ తెలిపాడు ఎన్టీఆర్.
#NTR @tarak9999 about being part of #RRRMovie #GoldenGlobes2023
pic.twitter.com/9Z64o0M9Zf— Suresh Kondi (@SureshKondi_) January 11, 2023