వైసీపీ ప్రభుత్వం ఏపీలో సంక్షేమం మాటున సంక్షోభం సృష్టిస్తోందని ఆరోపించారు టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. 7 లక్షల పింఛన్లు రద్దు చేసి పేదల పొట్ట కొట్టారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో 200 ఉన్న ఫించను 2000 వేలు చేశారని తెలిపారు. 54 లక్షల 25 వేల పింఛన్లు మంజూరు చేశామని టీడీపీ కంటే అదనంగా 6 లక్షల పింఛన్లు ఇచ్చామని వైసీపీ పచ్చి అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు.
60 లక్షలు పెంచామని చెచితే వైసీపీ డ్యాష్ బోర్డులో 52 ఫింఛన్లేనని ఎందుకు కనపడుతోందని ప్రశ్నించారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు రూ. 600 కోట్ల జీతాలిచ్చి పేదల పొట్ట కొడుతున్నారని, పింఛన్లు సరైన సమయానికి రాక, ఉన్న పింఛన్లు రద్దు చేయడంతో వృద్ధులు నష్టపోతున్నారన్నారు.
కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పింఛను రాక వృద్ధురాలు మృతి చెందిందని, ఇది వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిలువెత్తు నిదర్శనం అని విమర్శించారు. టీడీపీ హయాంలో కోటీ 40 లక్షల మందికి చంద్రబాబు రేషన్ ఇచ్చారు. వైసీపీ మాత్రం 9 నెలల్లోనే 20 లక్షల తెల్లరేషన్ కార్డులు తీసేసిందని తెలిపారు. కొంతమంది వాలంటీర్ సన్నాసులు పేదల దగ్గర 500 వసూలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోనే చాపాడ మండలం పల్లవోలు, బాదర్ పల్లి ఏరకంగా లంచాలు వసూలు చేస్తున్నారో మీకు కనపడం లేదా అని ప్రశ్నించారు.