దిశా చట్టం తీసుకువచ్చాం, మహిళలపట్ల సానుకూలంగా స్పదింస్తాం, సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా పోస్టుల పెట్టితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన జగన్ వారి ఎమ్మెల్యేలు అసభ్యంగా మాట్లాడేతే ఎక్కడున్నారని ప్రశ్నించారు టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ. ప్రభుత్వం చేసే తప్పులను విమర్శిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. మల్లాది విష్ణు కార్పొరేట్‌గా పోటీ చేసి ఎంత దారుణంగా ఓడిపోయారో అందరికి తెలుసు. మల్లాది విష్ణు గురించి బీసెంట్ రోడ్డుల్లో, ఉడా డిపాంట్‌మెంట్‌లో అడిగిన చెబుతారు.
గత 11రోజులుగా రాజధాని అమరావతి అని ప్రకటించాలని రాజధాని రైతులు 24 గంటలు రోడ్లపై నిరసన కార్యక్రమాలను తెలుపుతున్నారు.ఈ క్రమంలో కేబినేట్ మీటింగ్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొకుండా తిరిగి న్యాయ నిపుణుల కమిటీని సంప్రదింపులు జరిపిన తరువాత ముందుకు వెళ్తామని చెప్పడం జరిగింది. గత 7 నెలలుగా ఇదే న్యాయస్థానాలు 27సార్లు ప్రభుత్వ వైఖరిపై చీవాట్లు పెట్టిన విషయం మీకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. దేశంలో ఇంత తక్కువ సమయంలో న్యాయస్థానాల ద్వారా చీవాట్లు తిన్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాత్రమే.