పంచుమర్తి అనురాధ, టీడీపీ అధికార ప్రతినిధి
హైదరాబాద్ లోని టీవీ 5 కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడిని తెలుగుదేశం పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నవారే ఈ పని చేసి ఉంటారు. దాడి పిరికిపంద చర్య. ఇందుకు తగిన మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకుంటుంది.విద్యుత్ చార్జీలను ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు. ప్రభుత్వంలోకి రాకముందు దొంగ లెక్కలు చూపించి లక్షల కోట్లు మింగేసిన ఏ1 జగన్మోహన్ రెడ్డి, ఏ2 విజయసాయి రెడ్డి తమ పాండిత్యాన్ని విద్యుత్ చార్జీల పెంపుపై ఉపయోగించారు. ప్రజల నడ్డి విరిసే విధంగా విద్యుత్ చార్జీలు పెంచి ఇళ్లకు బిల్స్ పంపిస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ. 800 చిల్లర వచ్చిన కరెంటు బిల్లు మార్చిలో ఒక్కసారిగా రూ. 5 వేలకు పైగా ఎలా వస్తుంది?లాక్ డౌన్ తో ఉపాధి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారులు లేవు. కరోనా భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు కట్టమని ఇళ్లకు బిల్లులు పంపడమేంటి?వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్ లాక్ డౌన్ అయ్యింది. అందుకే ఒక్క పరిశ్రమ రాలేదు. రూపాయి పెట్టుబడి రాలేదు. ఉద్యోగాలూ రాలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రూపాయి సంపద సృష్టించడం చేతకాదు కానీ, రూ. 77 వేల కోట్లు అప్పులు చేశారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ చంద్రబాబు రూ. 2 లక్షల కోట్ల సంక్షే కార్యక్రమాలు అమలు చేశారు. రూ. 21 వేల కోట్లు డ్వాక్రా మహిళ అకౌంట్లో జమ చేశారు. ప్రాజెక్టుల కోసం రూ. 65 వేల కోట్లు ఖర్చు చేశారు. పోలవరం పనులు 70 శాతం పూర్తి చేశారు. అమరావతి 40 శాతం పూర్తి చేశారు.
రైతులకు రూ. 17 వేల కోట్ల రుణమాఫీ చేశారు. లోటు బడ్జెట్, రాజధాని లేని రాష్ట్రం అయినప్పటికీ ఐదేళ్ల టీడీపీ పాలనలో చంద్రబాబు కేవలం లక్షా 658 కోట్లు మాత్రమే అప్పు చేశారు. జీడీపీ డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ సాధించారు. లక్షా 60 వేల వరకూ తలసరి ఆదాయం పెంచారు. రాబోయే నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం 4న్నర లక్షల కోట్లు అప్పులు చేసే అవకాశం ఉంది. వైసీపీ మహిళా నేతలు ఇష్టారీతిన మాట్లాడతారు. టీడీపీ హయాంలో కేవలం లక్షా 658 కోట్లు మాత్రమే అప్పు చేయాల్సి వచ్చిందని స్వయంగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారే చెప్పారు. విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పిన మాటకు కట్టబడి టీడీపీ హయాంలో ఒక్క రూపాయి పెంచలేదు. అప్పటికే 22.3 మిలియన్ యూనిట్లు లోటు ఉన్నా దాన్ని భర్తీ చేశాం. పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించాం. వైసీపీ పాలనలో ఎప్పుడు కరెంటు ఉంటుందో పోతుందో తెలీదు. ఈ నెల 8 వందలు వచ్చిన బిల్లు వచ్చే నెలలో 5 వేలు వచ్చేస్తుందా…దీనిపై ప్రభుత్వం స్పందించాలి. మధ్య తరగతి కుటుంబాలను ఆదుకోవాలి. 77 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు. 40 వేల కోట్లు ప్రజలపై భారం వేశారు. ఆర్టీసీపై దాదాపు రూ. 1400 కోట్లు భారం వేశారు. విద్యుత్ చార్జీల రూపంలో రూ. 1300 కోట్లపైనే భారం మోపారు ప్రజలపై. ఇక ఇసుక ధరలు చెప్పవసరం లేదు. నోటి కొచ్చనట్టు పెంచేశారు. సిమెంటు ధరలు రూ. 120 రూపాయిలు అదనంగా పెంచేశారు. మద్యపాన నిషేదం చేస్తామని పైకి చెప్పారు. వాటి ధరలు పెంచేసి రూ. 8000 వేల కోట్లు అదనంగా ఆదాయం పొందుతున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో ఇంకో రూ. 15000 వేల కోట్లు సంపాదించేందుకు ప్రణాళిక వేసి అమలు చేస్తున్నారు.
మద్యం మీద రూ. 23 వేల కోట్లు , సిమెంట్ ధర మీద రూ. 8000 వేల కోట్లు…మొత్తంగా రూ. 40 వేల కోట్ల భారం ప్రజలపై వేశారు. ఇదేనా పాలనంటే? లాక్ డౌన్ ఉన్నప్పటికీ 1887 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సింగిల్ డిజిట్ కి రావడం లేదు. ప్రతి నెలా 3 లక్షల 35 వేలు జీతాలు తీసుకున్న వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఏం సమాధానం చెప్తారు? ధాన్యం కొనుగోలు చేసే వారు లేక ప్రజలు బాధ పడుతున్నారు. రైతులను నట్టేట ముంచిన ఆ కన్నబాబు ఎక్కడున్నారు? రైతులకు ఏం సమాధానం చెప్తారు? లాక్ డౌన్ నడుస్తుండగా ఎల్జీ పాలిమర్స్ కు ఏవిధంగా పర్మిషన్ ఇచ్చారు? మంత్రి గౌతమ్ రెడ్డి సమాధానం చెప్పాలి. విశాఖలో కరోనా ఓ వైపు మరోవైపు విష వాయువులతో ప్రజలు అల్లాడుతున్నారు. మంత్రులు బాధ్యత లేకుండా చంద్రబాబు, టీడీపీపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. మీకు ప్రజలంటే పట్టదా? ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా ? ముఖ్యమంత్రి ఇల్లు కదిలారు. వరదలు వచ్చినప్పుడు, బోటు మునిగినప్పుడు, ఇసుక మాఫియా వల్ల 40, 50 మంది ఆత్మహత్య చేసుకున్నప్పుడు, అమరావతి రైతులను రాబందుల్లా పీక్కు తిన్నప్పుడూ కదలని ముఖ్యమంత్రి వైజాగ్ కోసం బయటకొచ్చారు.
వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ లొసుగులు, మీరు పెట్టిన కేసులేంటో అందరికీ తెలుసు. అవన్నీ మేము బయటపెడతాం. రెండేళ్లు, ఆర్నెల్లు జైలు శిక్ష అంటూ తూతూమంత్రంగా కేసులు పెట్టారు. ఫర్నీచర్ తీసుకెళ్లండి లేదంటే రేటు చెప్పండి కడతాను అని చెప్పిన కోడెల శివప్రసాద్ పై 10 ఏళ్ల జైలు శిక్ష కేసులన్నారు. వైజాగ్ లో 12 మంది చనిపోయి 1000 మందికి పైగా తీవ్ర అనారోగ్యంపాలయితే సదరు కంపెనీ యాజమాన్యంపై మాత్రం 10 ఏళ్ల జైలు శిక్ష లేదు. వైసీపీ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారు. మెడలో పాము వేసుకున్నాక అది కరవక మానదు …ఒక్క చాన్స్ అని అడిగితే గెలిపించినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి అని ప్రజలు బాధపడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలను బాధపెట్టి, భయపెడుతున్నారు. చివరకు మీడియాను కూడా వదలడం లేదు. పిచ్చి పిచ్చి జీవోలు తెస్తున్నారు. ఎల్లకాలం ఇది నడవదు. మీరు చేసింది ఖచ్చితంగా రికార్డు అవుతుంది.
కరోనాను సైతం పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా విద్యుత్, మున్సిపల్ చార్జీలు, ప్రాపర్టీ ట్యాక్స్ లు కట్టమని ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. డ్వాక్రా వారిని ఉద్దరించినట్టు అకౌంట్లలో వేశారు. వారు వాడుకోవాలంటే పొదుపు అకౌంట్ లో వేయాలా లేక లోన్ అకౌంట్ లో వేయాలా? లోన్ అకౌంట్ లో డబ్బులేసి వారు వాడుకోకుండా చేసేశారు. ఇదేనా డ్వాక్రా మహిళలను ఆదుకోవడమేంటే? ప్రభుత్వం దిగి వచ్చి విద్యుత్ చార్జీలు తగ్గించాలి. ప్రజలు ఎక్కడికీ వెళ్లరు. బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం కనీసం 3 నెలల సమయం ఇవ్వాలి.