ఐర్లాండ్ తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత ఆటగాడు దీపక్ హుడా అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. దీంతో మరో 16 బంతులు మిగిలి వుండగానే భారత్ విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్ కు మొదటి నుంచి వరుణుడు అడ్డుతగిలాడు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో టాస్ కూడా లేట్ అయింది. పలు మార్లు వర్షం వల్ల అంతరాయం కలగడంతో ఓవర్ల సంఖ్యను 12కు తగ్గించారు.
ఐర్లాండ్ విసిరిన 109 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టుకు ఓపెనర్లు దీపక్ హుడా, ఇషాన్ కిషాన్ లు మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్ కు వీరు 30 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ డకౌట్ గా వెనుదిరిగినప్పటికీ ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య(24) రాణించడంతో భారత్ సునాయాసంగా విజయాన్ని అందుకుంది. ఐర్లాండ్ బౌలర్లలో క్రేగ్ యంగ్ 2 వికెట్లు తీశారు.
మొదట బ్యాటింగ్ దిగిన ఐర్లాండ్ జట్టుకు ఆదిలోనే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు పాల్ స్టెర్లింగ్ (4),అండ్రూ బాల్ బిర్ని(0)లు తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన వారిలో హర్రీ టెక్టర్(64) తప్ప మరెవరూ ఆశించిన రీతిలో రాణించకపోవడంతో ఐర్లాండ్ 108 పరుగులు మాత్రమే చేసింది.