ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా తెల్లజుట్టు వచ్చేస్తోంది. వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి, ఆందోళన, రోజువారీ జీవన విధానం, రసాయనాలు కలిగిన షాంపూలను వాడడం, థైరాయిడ్, విటమిన్ బి12 లోపం వంటి అనేక కారణాల చేత తెల్లజుట్టు సమస్య వస్తోంది.
చాలా మంది తెల్లజుట్టును నల్లగా మార్చుకోవడానికి ఉపయోగించని చిట్కాలు ఉండవు. డైలు, షాంపూలు.. మొదలైనవి వాడడం వల్ల అప్పటికీ జుట్టు నల్లబడిన ఆ తరువాత కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. జుట్టు రాలిపోవడం, పొడి బారిపోవడం,అలర్జీలతో పాటు రకరకాల చర్మ వ్యాధుల సమస్యలు తలెత్తున్నాయి.
కేవలం వాటిని మాత్రమే ఉపయోగించడం కాకుండా ఎంతో సులభంగా చక్కటి చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టు తెల్లబడకుండా నల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం రెండు బొప్పాయి చెట్టు ఆకులు, 5 బిర్యానీ ఆకులు, 5 లవంగాలు, ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్, తగినంత హెన్నా పౌడర్ ను ఉపయోగించుకోవాలి.
ముందుగా బొప్పాయి ఆకులను శుభ్రంగా కడగాలి. తరువాత వాటిని ముక్కులుగా చేసి ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత అందులో అర గ్లాస్ నీళ్లు పోసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడకట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత మరో గిన్నెలోకి ఒక గ్లాస్ నీళ్లు, బిర్యానీ ఆకులు, లవంగాలు, కాఫీ పౌడర్ వేసి మరిగించాలి. వీటిని అర గ్లాస్ అయ్యే వరకు మరిగించి వడకట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
దానిని ఒక కళాయి లేదా గిన్నెను తీసుకుని అందులో జుట్టుకు తగినంత హెన్నా పౌడర్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో బొప్పాయి ఆకుల రసం, అలాగే బిర్యానీ ఆకుల డికాషన్ ను వేస్తూ పేస్ట్ లా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 5 గంటల పాటు అలాగే ఉంచాలి. 5 గంటల తరువాత ఈ పేస్ట్ ను మరోసారి కలుపుకుని జుట్టు కుదుళ్ల నుండి జుట్టు చివరి వరకు పట్టించాలి.
దీనిని ఒక గంట పాటు జుట్టుకు అలాగే ఉంచి ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ముందుగా షాంపు వాడకుండా తలస్నానం చేయాలి. తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. ఈ విధంగా ఈ చిట్కాను నెలకు రెండు సార్లు వాడడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అలాగే జుట్టు నల్లగా, ఒత్తుగా, ధృడంగా పెరుగుతుంది.
అంతేకాకుండా జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు చివర్లు చిట్లడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. తెల్లజుట్టు సమస్యతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు.