రాజమహేంద్రవరం: బోట్ ప్రమాదంలో విశాఖ నుంచి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది గల్లంతవ్వడం విషాదం. విశాఖకు చెందిన మధుపాడ రమణ, అరుణ కుటుంబం మొత్తం పిల్లలతో కలిసి రాజమహేంద్రి వెళ్లారు. అక్కడ నుంచి బోటులో భద్రాచలం వెళ్తున్నట్టు తమ బంధువు రామకృష్ణతో మాట్లాడి చెప్పారు.
ప్రమాదం తరువాత ఎంత ప్రయత్నించినా ఒక్కరి ఫోన్ కూడా కలవడం లేదని రామకృష్ణ కన్నీళ్ల పర్యంతమయ్యారు. తమ బంధువులు రమణ, అరుణ కుటుంబాల ఆచూకీ వెంటనే తెలుసుకోవాలని రామకృష్ణ కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించారు.
వీరంతా ప్రమాదం జరిగిన రాయల్ వశిష్ఠ బోట్‌లో ఉన్నారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి, మంగమ్మ ఆసుపత్రి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.