కరోనా ప్రభావంతో గడగడ వణికిపోతున్న ప్రపంచ దేశాలకు మరో షాక్ తగలబోతుంది. ఫార్మా రంగంలో చైనాపై ఆధారపడ్డ దేశాలకు మోయని భారం కాబోతుంది. కొవిడ్-19 కారణంగా ఇప్పటికే 1800కు పైగా జనం చనిపోయారు. వేలాది మంది వైరస్ సోకటంతో ఆసుపత్రిలకే పరిమితం కాగా…. జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో చైనాలో ఫార్మా సహా వివిధ ఉత్పత్తులపై దీని ప్రభావం గణనీయంగా పడింది.
చైనాలో కొవిడ్-19 కారణంగా ఫార్మా కంపెనీలన్నీ మూతపడ్డాయి. చైనా నుండి వచ్చే పారాసిటమల్ టాబ్లెట్స్‌పై భారత్ ఎంతో ఆధారపడి ఉంది. దీంతో ఇప్పుడు ఈ జ్వరం ట్యాబ్‌లెట్స్ ధర దాదాపు 40శాతం పెరగబోతుంది. అంతేకాదు యాంటీబయోటిక్ ట్యాబ్‌లెట్స్ ధరలు ఆకాశనంటనున్నాయి. ఇప్పటికే అత్యధిక ధర ఉండే వీటి ధర మరో 70శాతం పెరగనుందటని ఫార్మా కంపెనీలంటున్నాయి.
ఇప్పటికే చైనా నుండి దిగుమతి గణనీయంగా తగ్గింది. ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు దిగుమతి చేసుకున్న ట్యాబ్‌లెట్స్ ఏప్రిల్ వరకు సరిపోతాయి. అప్పటికీ సప్లై మొదలుకాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికర పరిణామాలు తలెత్తుతాయంటున్నాయి ఫార్మా వర్గాలు.
కేంద్రం వెంటనే దీనిపై ముందుచూపుతో వ్యవహరిస్తే తప్పా… సామాన్యుడిపై భారం తప్పదని అంచానా వేస్తున్నాయి.