అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి -parakala prabhakar on pothana poetry - Tolivelugu

అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి

parakala prabhakar on pothana poetry, అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి

(డాక్టర్ పరకాల ప్రభాకర్, ఆర్థికవేత్త, సామాజిక విశ్లేషకుడు)

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.

parakala prabhakar on pothana poetry, అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి

టీకా:
అమ్మలన్ = అమ్మలను(సప్త మాతృకలు); కన్న = కన్నటువంటి (కంటె గొప్ప దైన); అమ్మ = తల్లి; ముగురు = ముగ్గురు {ముగురు అమ్మలు – లక్ష్మి సరస్వతి పార్వతి}; అమ్మల = అమ్మలకి; మూలపు = మూల మైన; అమ్మ = అమ్మ; చాలన్ = చాలా; పెద్ద = పెద్ద; అమ్మ = అమ్మ; సురారుల = రాక్షసుల యొక్క {సురారులు – సుర (దేవతల) అరులు (శత్రువులు), రాక్షసులు}; అమ్మ = తల్లి; కడుపు = కడుపు; ఆఱడి = మంట; పుచ్చిన = కలిగించిన; అమ్మ = అమ్మ; తన్ను = తనను; లోన్ = మనసు లోపల; నమ్మిన = నమ్మిన; వేల్పు = దేవతల; అమ్మల = తల్లుల; మనమ్ముల = మనసులలో; ఉండెడి = ఉండే; అమ్మ = అమ్మ; దుర్గ = దుర్గాదేవి; మా = మా; అమ్మ = అమ్మ; కృప = దయా; అబ్ధి = సముద్రముతో; ఇచ్చుత = ఇచ్చుగాక; మహత్త్వ = గొప్పదైన; కవిత్వ = కవిత్వంలో; పటుత్వ = పటుత్వమనే; సంపదల్ = సంపదలు.
భావము:
దుర్గాదేవి తల్లు లందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి; రక్కసి మూకలను అణచిన యమ్మ; నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి; అయిన మా అమ్మ దయాసముద్రి అయి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.

parakala prabhakar on pothana poetry, అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి

జగన్మాత మీద ఇంతకన్న గొప్ప పద్యాన్ని బహుశః మరెవరూ వ్రాసిఉండరనుకుంటా.
పోతనామాత్యుడు తనకు మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఇవ్వమని ఆమెను వేడుకున్నాడు. ఆవిడ ఇచ్చినందుకే కాబోలు ఆయన మనకు శ్రీమదాంధ్ర మహాభాగవతము ప్రసాదించగలిగాడు.

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

parakala prabhakar on pothana poetry, అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి

Share on facebook
Share on twitter
Share on whatsapp