గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన సైనికులకు కేంద్రం చక్ర అవార్డులను ప్రదానం చేసే ఆలోచన చేస్తోంది. నాడు అమరులైన 20 మందిలో తెలంగాణవాసి కల్నల్ సంతోష్ బాబు ఉన్నారు. అయితే ఆయనకు పరమ్ వీర్ చక్ర అవార్డును ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆయనతో పాటు మిగిలిన వారికి కూడా అవార్డులు ప్రకటించేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించినట్టుగా సమాచారం.
చక్ర అవార్డుల్లో.. అత్యుత్తమైనది పరమ్‌వీర్ చక్ర. ఆ తర్వాత మహావీర్ చక్ర, వీర చక్ర అవార్డులు ఉంటాయి.