మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తున్న నేషనల్ పారామోటార్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో చివరిరోజున అపశ్రుతి చోటుచేసుకుంది. నిన్న (ఆదివారం) ముగింపు కార్యక్రమంలో జిల్లా జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీనివాస్ సరదాగా విహరించచేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పారామోటార్‌ను ఎక్కి గాల్లోకి ఎగురుతుండగా అది అదుపు తప్పింది. దీంతో సుమారు 10 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. అటు పారామోటార్ కూడా తీవ్ర స్థాయిలో దెబ్బతింది. అయితే పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, తెలంగాణ పర్యాటకశాఖ, వర్టికల్ వరల్డ్ ఏరో స్పోర్ట్స్ సంయుక్తంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తొలిసారిగా ఈ నేషనల్ లెవల్ పారామోటారింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించాయి. ముగింపు రోజున ఈ ఘటన మినహా ఐదు రోజులపాటు సందడిగా సాగాయి.