బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో కాస్తా రొమాన్స్ షోగా మారినట్లుగా కనబడుతోంది. ఈ షో లో కంటెస్టెంట్ లుగా ఉన్న పరాస్ చాబ్రా, మహీరా శర్మల మధ్య రొమాన్స్ పీక్ స్టేజ్ కు చేరింది. పరాస్, మహీరాను ఆట పేరుతో ముద్దు పెట్టుకుంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మహీరా పరాస్‌ను కటువుగానే హెచ్చరించింది. మరోసారి ముద్దు పెడితే పెదాలు కోసేస్తానని తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చింది.
షోలో మహీరా అనుమతి లేకుండా పరాస్ ఆమెను కిస్ చేస్తున్నాడు. పదేపదే ఇలా వ్యవహరిస్తుండటంతో ఆమె ఇలా చేయవద్దని సూచించింది. అయినప్పటికీ అతను ఏమాత్రం లెక్కచేయలేదు. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు చోటుచేసుకున్నాయి. మహీరాను కిస్ చేయకుండా తాను నిద్ర లేవనంటూ గతంలో చాలా సార్లు చెప్పాడు. చెప్పినట్టుగానే ఆమె మంచం దగ్గరకు వెళ్తున్నాడు పరాస్. కొంతకాలం ఓపిక పట్టిన మహీరా ఇక తట్టుకోలేక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మరోసారి కిస్ పెట్టేందుకు యత్నిస్తే పెదాలు కోసేస్తానంటూ ఆవేశాన్ని వెళ్లగక్కింది..