కథ రాసుకున్న తర్వాత మహేష్ ను సంప్రదించారా? లేక మహేష్ ను సంప్రదించిన తర్వాత అనుకున్న కథలో మార్పుచేర్పులు చేశారా? దీనికి సూటిగా సమాధానం చెప్పాడు దర్శకుడు పరశురామ్. ఒకరి కోసం తను కథను మార్చనని క్లారిటీ ఇచ్చాడు.
“హీరో మేనరిజమ్స్ కు తగ్గట్టు మార్పులు చేస్తాను తప్ప, కథలో మార్పులు చేయను. హీరో ఎవరైనా కథ నేను అనుకున్నట్టుగానే ఉండాలి. ఇక సర్కారువారి పాట విషయానికొస్తే, ఆ సినిమా కథను రాసుకున్నప్పుడే మహేష్ బాబును దృష్టిలో పెట్టుకొని రాశాను. మహేష్ లాంటి హీరో మాత్రమే ఆ కథకు న్యాయం చేయగలడు అనిపించింది. నా అదృష్టం కొద్దీ మహేష్ ఒప్పుకున్నారు.”
ఇలా కథ విషయంలో తన క్లారిటీ చెప్పుకొచ్చాడు పరశురామ్. తన సినిమాలకు తనే డైలాగ్స్ రాసుకునే ఈ దర్శకుడు.. ఈ విషయంలో మాత్రం చాలా ఇన్ పుట్స్ తీసుకుంటానని స్పష్టంచేశాడు. బ్యాంకింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కాబట్టి చాలామంది బ్యాంకు నిపుణులతో మాట్లాడి డైలాగ్స్ రాశానని అన్నాడు.
ఈ విషయంలో పూరి జగన్నాధ్, కొరటాల శివ కూడా తనకు సహకరించిన విషయాన్ని కొరటాల గుర్తు చేసుకున్నాడు. వాళ్లు ఇచ్చిన ఇన్ పుట్స్ తనకు బాగా హెల్ప్ అయ్యాయని అన్నాడు. ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.