నాగచైతన్య-పరశురామ్.. ఈ కాంబినేషన్ ఇప్పటిది కాదు. దాదాపు రెండేళ్ల కిందటే వీళ్ల కాంబోలో సినిమా రావాల్సింది. కానీ మధ్యలో మహేష్ ఎంటర్ అవ్వడంతో.. ఈ కాంబినేషన్ లో సినిమా లేట్ అయింది. పరశురామ్, మహేష్ హీరోగా సర్కారువారి పాట సినిమా తీయాల్సి వచ్చింది.
ఇప్పుడు పరశురామ్ పూర్తిగా తన దృష్టి మొత్తం నాగచైతన్య సినిమాపైనే పెట్టాడు. దీని కోసం డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. సీలేరు బ్యారేజీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతోందట. ఈ కథకు సంబంధించి 30 నిమిషాల పాటు చైతూ-పరశురామ్ మధ్య చర్చలు కూడా ముగిశాయి.
నాగచైతన్యకు స్టోరీ బాగా నచ్చింది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో పరశురామ్ ఇప్పుడు ఈ లైన్ ను డెవలప్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. కంప్లీట్ నెరేషన్ విన్న తర్వాత నచ్చితే నాగచైతన్య ఈ ప్రాజెక్టుకు ఓకే చెబుతాడు.
ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. ఈ సినిమా కంప్లీట్ అయ్యేలోపు పరశురామ్ కథ పూర్తిచేస్తే సరి, లేదంటే మరో దర్శకుడితో నాగచైతన్య సినిమా ప్రకటిస్తాడు. అప్పుడు పరశురామ్ కు కెరీర్ లో మరింత గ్యాప్ పెరిగిపోతుంది.