బాలీవుడ్ ప్రేమలన్నీ…పెళ్ళిళ్ళకు వరుస కడుతున్నాయ్. దీంతో పెళ్ళి వేడుకలకు అతిథిగా అటెండ్ అయ్యే పెళ్ళికాని బాలీవుడ్ భామలకు ఇది సంకటంగా మారింది. ఇక విషయానికి వస్తే…రణబీర్ – ఆలియా, సిద్ధార్థ్ – కియారా, కేఎల్ రాహుల్ – అతియాశెట్టి..ఇలా ప్రేమపెళ్ళిళ్ళు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే.
అయితే పనిలో పనిగా పెళ్ళికెళ్ళిన పరిణీతి చోప్రాను నీ పెళ్లెప్పుడు? అని అడుగేస్తున్నారట.! తెలిసిన వాళ్ళు. పాపం పరిణీతి ఏదో ఒక విషయం చెప్పాలిగా..అడిగిన వారికల్లా “నేను పెళ్ళికి వ్యతిరేకం కాదు, వివాహ జీవితం కోసమే వెయిట్ చేస్తున్నాను” అని చెప్పుకొస్తుందట .
తన వివాహం గురించి పరిణీతి చోప్రా‘నా స్నేహితులు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. వాళ్లు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. నాకూ పెండ్లి చేసుకోవాలని, పిల్లలతో ఆడుకోవాలని ఉంది. కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితమూ అంతే ముఖ్యం.
సినిమానే జీవితం కాదు కదా. పెండ్లయితే నా జీవితంలో ఓ పెద్ద పని పూర్తవుతుంది. కోరుకున్న వ్యక్తి దొరికితే అతన్ని ప్రేమిస్తాను,పెండ్లి చేసుకుంటాను. ఇప్పటిదాకా నా జీవితంలో అలాంటి వాడే కనిపించలేదు’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ నాయిక ఖాతాలో ‘క్యాప్సుల్ గిల్’, ‘ఛమ్కీలా’ చిత్రాలున్నాయి. మనలో మన మాట..తాను అనుకున్నట్టుగా పెళ్ళైతే ఒక పనిఅయిపోదు..అసలైన కథ అప్పుడే మొదలవుతుంది..! ఏమంటారు ?