దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. దీనితో ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పొడిగిస్తూ వస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా దినసరి కూలీలు ఆర్థిక ఇబ్బందులతో తినటానికి తిండి కూడా లేక అల్లాడిపోతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. అయితే అలాంటి గిరిజనుల కోసం ములుగు ఎమ్మెల్యే సీతక్క వాగులు వంకలు లెక్క చేయకుండా, రాత్రి, పగలు తేడా లేకుండా వారికి సహాయం చేస్తుంది. వారు తినటానికి తిండి, నెలకు సరిపడా సరుకులను పంచుతుంది. ఇదే విషయమై అనంతపురం టీడీపీ యువ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత కొడుకు… పరిటాల శ్రీరామ్ స్పందించారు.
లాక్ డౌన్ సమయంలో అడవిబిడ్డల ఆకలికేకలు అర్థం చేసుకొని వాగులు వంకలు దాటుకుంటూ నువ్వు వెళ్లి చేస్తున్న సాయం నేను రోజు చూస్తూనే ఉన్నా అమ్మ.నీ సేవా స్ఫూర్తి అద్భుతం ఆదర్శప్రాయం.మకిలి పట్టిన ఈ రాజకీయ వ్యవస్థలో నీలాంటి నిజమైన,నిఖార్సయిన రాజకీయ నాయకులే మా యువతరానికి ఆదర్శం @seethakkaMLA pic.twitter.com/e7wGWBJWUX
— Paritala Sreeram (@IParitalaSriram) May 11, 2020
లాక్ డౌన్ సమయంలో అడవిబిడ్డల ఆకలికేకలు అర్థం చేసుకొని వాగులు వంకలు దాటుకుంటూ నువ్వు వెళ్లి చేస్తున్న సాయం నేను రోజు చూస్తూనే ఉన్నా అమ్మ.నీ సేవా స్ఫూర్తి అద్భుతం ఆదర్శప్రాయం.మకిలి పట్టిన ఈ రాజకీయ వ్యవస్థలో నీలాంటి నిజమైన,నిఖార్సయిన రాజకీయ నాయకులే మా యువతరానికి ఆదర్శమంటూ ట్వీట్ చేశాడు.