పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 31 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 6న సమావేశాలు ముగియనున్నాయి. మొత్తం 66 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.
బడ్జెట్ మొదటి రోజు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో నిర్వహించనున్నారు ఈ సమావేశంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. దీంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి.
అనంతరం రాష్ట్ర పతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెడతారు. రాష్ట్రపతి ప్రసంగం, కేంద్ర బడ్జెట్ , ఇతర అంశాలపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చల కోసం తాము ఎదురు చూస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 14, మార్చి 12 మధ్య సమావేశాలకు విరామం ఇస్తున్నారు.
2023 బడ్జెట్ సెషన్‌లో సంబంధిత శాఖలు, పార్లమెంటరీ స్టాండిగ్ కమిటీలు, గ్రాంట్ల కోసం డిమాండ్లను పరిశీలించేందుకు, మంత్రిత్వ శాఖలకు సంబంధించిన నివేదికలను రూపొందించడానికి వీలుగా ఫిబ్రవరి 14 నుంచి మార్చి 12 వరకు విరామం ఉంటుందని ఆయన వెల్లడించారు.