అప్పటికే ఎనిమిది వికెట్లు కోల్పోయిందో రంజీ జట్టు. కన్ఫమ్ గా కొడతారనుకున్న బ్యాట్స్ మేన్లు దగాచేసారు. ఒకరి వెనుక ఒకురు పెవిలియన్ దారిపట్టారు. ఇక వచ్చేది బౌలర్ ..బ్యాట్సమేన్ల వల్ల కానిది బౌలర్ వల్ల ఏమవుతుంది అనుకున్నారంతా.
అయితే తొమ్మిదో స్థానంలో వచ్చిన వాడు బౌలరే కానీ మామూలోడు కాదు. అవసరాన్నిబట్టి ఆల్ రౌండర్ అయిపోతాడు. సాటి బౌలర్లని ఉతకాలని స్ట్రాంగ్ గా ఫిక్సై వచ్చాడు.తాను అనుకున్నట్టుగానే తాటతీసి వదిలిపెట్టాడు ఆ వర్ధమాన క్రికెటర్.
అతని పేరు పార్థ్ భట్. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ రెండో క్వార్టర్ ఫైనల్‌లో సౌరాష్ట్రకు చెందిన పార్థ్ భట్ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ 147 పరుగులకే 8 వికెట్లు కోల్పోగా.. 9వ స్థానంలో వచ్చిన బౌలర్ పార్థ్ భట్ (111 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు)ఆల్ రౌండర్ గా అజేయ శతకంతో చెలరేగి తన జట్టుకు 303 పరుగుల గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు.
అతడికి తోడుగా ఓపెనర్ స్నెల్ పటేల్ (70) అర్ధ సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ మాత్రమే జట్టులో టాప్ స్కోరర్లు కాగా.. మిగిలిన ప్లేయర్స్ అందరూ కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు.
అలాగే ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా స్థానంలో సౌరాష్ట్రకు అర్పిత్ వసవద సారధ్య బాధ్యతలు స్వీకరించారు. అటు పంజాబ్ బౌలర్లలో మార్కండే 4 వికెట్లు, బల్తేజ్ సింగ్, సిద్ధార్థ్ కౌల్ చెరో 2 వికెట్లు, నమన్ ధిర్ ఓ వికెట్ తీశారు.