టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కాం బెంగాల్ లో కలకలం రేపుతోంది. మంత్రి సహాయకురాలి ఇంట్లో భారీగా డబ్బుల దొరకడంతో, మంత్రి పార్థ చటర్జీని ఈడీ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు.
తాజాగా ఆయన్ని మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ పెరుగుతోంది. ఆయన్ని మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలని సొంత పార్టీ నేతలే పట్టుబట్టుతున్నారు.
పార్థ చటర్జీని మంత్రి వర్గం నుంచి తొలగించాలని, పార్టీ పదవు నుంచి కూడా ఆయకు ఉద్వాసన పలకాలని టీఎంసీ జనరల్ సెక్రటరీ కునాల్ ఘోష్ డిమాండ్ చేశారు.
తాను తప్పుగా మాట్లాడటం లేదని, ఒక వేళ తన వ్యాఖ్యలను తప్పుగా భావిస్తే తనను పార్టీ నుంచి తొలగించేందుకు చీఫ్ మమతాకు అధికారం ఉందన్నారు. తాను మాత్రం టీఎంసీ సైనికుడిగా కొనసాగుతానంటూ ట్వీట్ చేశారు.